Seelavathi Title Controversy | Shakeela Questions Censor Board

2018-06-13 941

Shakeela news movie controversy. censor team orders to change Seelavathi title

శృంగార తార షకీలా చాలా గ్యాప్ తరువాత నటించిన చిత్రం శీలవతి. ఆ మధ్యన విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్స్ కూడా చిత్రంపై ఆసక్తిని పెంచాయి. వరుసగా విడుదల వాయిదా పడుతుండగా ఈ నెలలో విడుదలవుతుందని భావించారు.
శీలవతి.. షకీలా నటిస్తున్న 250 వ చిత్రం కావడం విశేషం.
ఈ నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని సెన్సార్ ముందుకు ఈ చిత్రాన్ని తీసుకుని వెళ్లగా వారు అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది. షకీలా చిత్రానికి అలాంటి టైటిల్ ఉండకూడదని సెన్సార్ సభ్యులు చెప్పడంతో చిత్ర యూనిట్ షాక్ కి గురయ్యారు. టైటిల్ మార్చాల్సిందే అని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ వివాదంపై షకీలా స్పందించింది. సినిమా చూడకుండానే ఈ టైటిల్ ఎందుకు వద్దంటున్నారో తనకు కారణం చెప్పాలని షకీలా అడుగుతోంది. డబ్బింగ్ చిత్రానికి కూడా ఇదే టైటిల్ పెట్టామని, సినిమా విడుదుల అయ్యేలా సహకరించాలని కోరింది.